Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదింటి పెళ్లికూతురికి పుస్తె మెట్టల అందజేత

పేదింటి పెళ్లికూతురికి పుస్తె మెట్టల అందజేత

- Advertisement -

–  టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి

పేద కుటుంబానికి చెందిన పెళ్లికూతురికి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం పుస్తె మట్టలు అందజేసి సహాయం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన రావణబోయిన మమత కుమార్తె మాధవి (దీప్తి) వివాహం లింగంపేట్ మండల కేంద్రంలోని డీపీఎల్ గార్డెన్‌లో నిర్వహించారు. మాధవి తండ్రి లేకపోవడంతో కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉండటంతో పెళ్లి నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని సంప్రదించగా ఆయన వెంటనే స్పందించి వివాహానికి అవసరమైన పుస్తె మట్టలను స్వయంగా వివాహ వేడుకకు హాజరై అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ సర్పంచ్ కౌడా రవి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జూలూరి సుధాకర్, పిడుగు సాయిబాబా, బండారి శ్రీకాంత్, నర్సల్లా మహేష్, రాశేఖర్, సునీల్, నిరంజన్, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -