Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అమ్మకి భరోసా కిట్టు అందజేత..

అమ్మకి భరోసా కిట్టు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా గ్రామంలో అమ్మకి భరోసా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కిట్టును అందజేశారు. మంగళవారం రోజు రెడ్డినాయక్ తండా  గ్రామం లోని మొదటి ప్రసవానికి సిద్దంగా ఉన్న  పల్లవి భర్త సంతోష్ అనే గర్భిణీ స్త్రీ ఇంటి  కలెక్టర్ సందర్శించి, గర్భిణీ స్త్రీ ఐన  పల్లవి తో  ఆప్యాయంగా మాట్లాడి, వారి బాగోగులు,ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా? మందులు వేసుకుంటున్నావా? అంటూ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో శ్రద్ధ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండతాడని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితులని అడిగి తెలుసుకున్నారు.

ఈ సమయంలో మానసిక ఒత్తిడులు గురికాకుండా  ఉండాలని సూచించారు. కుటుంబానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్‌ను వారికీ అందజేశారు. అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకోవడం మంచిదని పూర్తి  అనవసర ఖర్చులు లేకుండా ప్రసవం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సమయంలో తల్లి, బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. ప్రసవించిన  తర్వాత 102 వాహన సేవ ద్వారా తల్లిని బిడ్డతో కలిపి ఇంటి వద్ద దింపే సదుపాయం కూడా ఉందని వివరించారు. శ్రీమతి పల్లవి గారికి రక్తశాతం తక్కువగా ఉనందున హిమోగ్లోబిన్ శాతం పెంచేందుకు తీసుకోవలసిన ఆహార పదార్థాలపై కూడా కలెక్టర్ గర్భిణి స్త్రీ కి అవగాహన కల్పించారు. మెంతికూర, తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలను పప్పుతో కలిపి వారానికి కనీసం రెండు సార్లు తినాలని చెప్పారు. అలాగే గ్లాస్ పాలు, కొబ్బరి ముక్కలు (ఎండినవి లేదా తాజా), పల్లీలు బెల్లంతో కలిపి, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఐరన్ ట్యాబ్లెట్స్ లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకోవడం మంచిదని సూచించారు.

ఈ రకమైన ఆహారం ద్వారా గర్భిణిలు శారీరకంగా, మానసికంగా బిడ్డ ఎదుగుదల ఉంటుంది. అలాగే కాన్పు అయిన తర్వాత ఒక గంటలోపు ముర్రు పాలను తప్పకుండా ఇవ్వాలనే అంశంపై కూడా గర్భిణికి అవగాహన కల్పించారు. ప్రతి నెలలో ఒక రోజు “అమ్మకు భరోసా” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకి సూచించారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందడంతో పాటు తల్లి,బిడ్డల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపాలన్నారు. అదేవిదంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తరచూ గర్భిణీ స్త్రీల  ఇండ్లను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వారికీ తగిన సలహాలు , సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad