Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅన్ని దానాలకన్నా అన్నదానం మిన్న: సీఐ

అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న: సీఐ

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
అన్ని దానాలకన్న అన్నదానం గొప్పదని మణుగూరు సి ఐ పాటి నాగబాబు అన్నారు.వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఎండిఓ కార్యాలయం ఎదుట మణుగూరు ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని సి ఐ నాగబాబు,ఎస్ ఐ  రంజిత్ లు ప్రారంభించారు.సమాజంలో తమ వృత్తిలో ఎంతో బిజీగా ఉంటూనే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మణుగూరు ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ను ఆయనఅభినందించారు.

అనంతరం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు.. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన అందరికీ మండల ఫోటో గ్రాఫర్స్ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రెండు వేలమంది భక్తులకు పైగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారని కమిటీ సభ్యులు తెలిపారుఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వి. కృష్ణ మోహన్ పి.శ్రీనివాస్ శ్రీనివాస్ అఖిల వెంకట్ ఆనంద్ శ్రీ హరి  సురేష్ సాగర్ తులసి రాం పి కృష్ణ మరియు సంఘ నాయకులు సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad