పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్
నవతెలంగాణ – పాలకుర్తి
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో గల అన్నప్రసాద వితరణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి బోనగిరి కృష్ణమూర్తి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమం ప్రారంభం నుండి నేటి వరకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని అన్నారు.
అన్నదాన కార్యక్రమానికి దాతలుగా మారం శ్రీనివాస్, అల్లాడి వెంకటేశ్వర్లు, నంగునూరు మధు, రామగిరి నాగరాజు,నాగమళ్ళ సోమేశ్వర్,బోనగిరి కృష్ణమూర్తి, దొడ్డ శంకరయ్య మంతెన విద్యాసాగర్, పూస్కూరి రాము సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమం తో పాటు సేవా కార్యక్రమాలు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గజ్జి సంతోష్ కుమార్,సింగ వెంకట్ రాజ్,అల్లాడి వాసవి తదితరులు పాల్గొన్నారు.
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES