అపూర్వ దివ్యాంగుల రెసిడెన్షియల్ పాఠశాలలో అన్నదానం..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అని అపూర్వ దివ్యాంగుల(మూగ చెవిటి) రెసిడెన్షియల్ పాఠశాల కరస్పాండెంట్ మదనాచారి అన్నారు. గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని అపూర్వ దివ్యాంగుల పాఠశాలలో రామారం గ్రామానికి చెందిన చిలుక లింగయ్య, కృష్ణవేణి ల కూతురు చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.చిలుక వివేక పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
ప్రతి ఒక్కరు పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు పోకుండా వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ఒక్కరోజైనా వారికి ఆహారాన్ని అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాగే పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని అన్నారు.
మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మీరు మీ కుటుంబ సభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఆ దేవుడి ఆశీస్సులతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తేజశ్రీ, పార్వతి, హేమలత, స్వరూప, గీత, రజిత, కాంతమ్మ, భవాని, ఈశ్వర్, సరిత తదితరులు పాల్గొన్నారు.



