Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్ని దానాల్లో అన్నదానం గొప్పది 

అన్ని దానాల్లో అన్నదానం గొప్పది 

- Advertisement -

పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్ 
నవతెలంగాణ – పాలకుర్తి

అన్ని దానాల్లో అన్నదానం గొప్పదనం ఆర్యవైశ్య సంఘం మండల నాయకులు, పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ మారం శ్రీనివాస్ అన్నారు. అమావాస్యను పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదానం కేవలం ఆహారాన్ని అందించడం కాదని, గొప్ప సేవా కార్యక్రమంగా గుర్తించాలని తెలిపారు. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే మనకు గొప్ప సంతృప్తినిస్తుందని తెలిపారు. దాతల సహకారంతో ప్రతి అమావాస్యకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లాడి వెంకటేశ్వర్లు, నంగునూరు మధు, రామగిరి నాగరాజు, చెన్నూరి వెంకటేశ్వర్లు, మంతెన విద్యాసాగర్, పూసుకోరి రాము, గజ్జి సంతోష్, ఆవిరినేని పోతన రావు, అల్లాడి వాసవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -