చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మూవీ టైటిల్ గ్లింప్స్‌ను చిరు బర్త్‌డే నేపథ్యంలో శుక్రవారం మేకర్స్ లాంచ్ చేశారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్ పెట్టారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్.
టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ‘చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్, ఆయన లుక్ పరిచయం చేయాలనుకున్నాం. గ్లింప్స్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది. చిరంజీవి సినిమాలు ఎన్నో చూస్తూ పెరిగాను. ఆయన కం బ్యాక్ తర్వాత మెగా స్వాగ్ చూడాలని ఒక కోరిక ఉండేది. నాకు ఎప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఎదురు చూశాను. ఫైనల్‌గా ఆ అవకాశం వచ్చింది. చిరంజీవిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా రాబోయే సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, ఎంటర్టైన్మెంట్ అన్ని అద్భుతంగా కుదిరాయి. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్‌లో నుంచి మేము శంకరవరప్రసాద్ తీసుకుని ఈ సినిమాలో క్యారెక్టర్‌కి పెట్టడం జరిగింది. దాన్నే.. ‘మన శంకరవరప్రసాద్ గారు’గా చేసి సినిమాకి టైటిల్‌గా పెట్టాం. గింప్స్‌కి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు థ్యాంక్‌్‌స. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు. వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాంబో ఎలా ఉంటుందో ఈసారి పండక్కి చూస్తారు. ఈ గ్లింప్స్ జస్ట్ శాంపిలే. సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. భీమ్స్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే విజువల్స్ సమీర్ రెడ్డి అదరగొట్టారు. మీ అంచనాలకు తగ్గట్టే సంక్రాంతికి వస్తున్నాం’ అని తెలిపారు.
‘నాన్న పుట్టినరోజున ఆయనతో లేకుండా మీ అందరి ముందు ఇలా ఉండటం బహుశా ఇదే ఫస్ట్ టైం. ఇది వెరీ స్పెషల్ మూమెంట్. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల చెప్పారు. మరో ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ, ‘ఈ గ్లింప్స్ చూసి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఫాన్స్ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. చిరంజీవి సినిమాలను నేను, అనిల్ ఎలా చూసామో, ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఇందులో చిరంజీవిని చూపించాం. యూత్, ఫ్యామిలీ ఫ్యాన్స్.. అన్ని జనరేషన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది’ అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ,’మెగాస్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఈ స్థాయికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. అనిల్ రావిపూడికి జీవితాంతం కతజ్ఞతతో ఉంటాను’ అని అన్నారు. చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్ తదితరులు ఇందులో ముఖ్యతారాగణం.
గ్లింప్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే..
- Advertisement -
- Advertisement -