పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
తాజాగా ఈసినిమాలోని ఓ స్టిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ హ్యాట్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సష్టిస్తోంది.
విడుదలైన తక్షణమే పోస్టర్ వైరల్‌గా మారింది.
అభిమానులు, సినీ ప్రియులు పవన్ కళ్యాణ్ అద్భుతమైన లుక్‌కి ఫిదా అవుతున్నారు. ఈ భారీ స్పందన మరోసారి ఈ చిత్రంపై ఉన్న అపారమైన క్రేజ్‌ను నిరూపించింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ప్రచార చిత్రాలు సంచలనంగా మారి, అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతూ భారీ బజ్ సష్టించాయి. ‘దేఖ్ లేంగే సాలా’, ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రతి పాట పవర్‌స్టార్ ఆరాను మరింతగా ఆవిష్కరిస్తూ, అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, త్వరలోనే చిత్రానికి సంబంధించిన పవర్‌ప్యాక్డ్ 40 సెకన్ల గ్లింప్స్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కూర్పు: కార్తిక శ్రీనివాస్, కళ: ఆనంద్ సాయి, సీఈఓ: చెర్రీ.
అంచనాలు పెంచేలా గ్లింప్స్..
- Advertisement -
- Advertisement -



