అధ్యక్ష, కార్యదర్శులుగా రమేష్, సమ్మయ్య
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం
నవతెలంగాణ-పాలకుర్తి
గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్) మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైకాని ఐలేష్ అధ్యక్షతన జరిగిన గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం సమావేశంలో మండల అధ్యక్షునిగా మండలంలోని దర్దేపల్లి గ్రామానికి చెందిన జిట్టబోయిన రమేష్ ను, మండల ప్రధాన కార్యదర్శిగా మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన గడ్డి సమ్మయ్యను ఏకగ్రీవంగా అనుకున్నా రు. ఈ సందర్భంగా రమేష్, సమ్మయ్యలు మాట్లాడుతూ గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. గొర్రెల, మేకల పెంపకం దారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మా నియామకానికి సహకరించిన గొల్ల, కురుమలకు జిల్లా గౌరవ అధ్యక్షులు నకిర్త యాకయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మోటే దేవేందర్, సాదం రమేష్, సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
జిఎంపిఎస్ మండల కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



