నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో గొర్రెల మేకల పెంపకం దారుల జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ జిఎంపిఎస్ మండల కమిటీ సభ్యులు కూకుట్ల కృష్ణ ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయగిరిలోని లింగభాసవ గార్డెన్ లో జరిగే గొర్రెల మేకల పెంపకం దారుల మహాసభలలో గొర్రెల కాపరుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు జక్కుల మల్లేష్, శెట్టి నరసింహ, జక్కుల కిష్టయ్య, మాకోల్ సత్తయ్య, నోముల కొమురయ్య, జక్కుల నరసింహ, కుకుట్ల పరమేష్, జక్కుల పెద్ద మల్లేష్, నోముల శంకర్, జక్కుల చిన్న మల్లేష్, బొడ్డు రాజు, చిట్టి సిరిసిల్ల, జక్కుల మహేష్, శివ, సందీప్ లు పాల్గొన్నారు.
ముత్తిరెడ్డిగూడెంలో జీఎంపీఎస్ కరపత్రం ఆవిష్కరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES