Monday, July 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జీవో 49ని రద్దు చేయాలి: సీపీఐ(ఎం)

జీవో 49ని రద్దు చేయాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని మే 30న జీవో నెంబర్ 49 ని తీసుకువచ్చి ఆదివాసులకు తీరని అన్యాయం చేస్తుందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. సోమవారం ఆదివాసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జీవో రద్దు చేయాలని నిర్వహిస్తున్న బందుకు సంపూర్ణ మద్దతు పలికారు. అనంతరం 49 జీవో ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవ్వాల్ టైగర్ రిజర్వుల్ లో రావటంతో అభివృద్ధికి ఆటంకం అవుతుందని, ఆదివాసుల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ జీవో ఉన్నదన్నారు. ఈ జీవో రద్దు కోసం ఆదివాసి సంఘాల జేఏసీ పిలుపు బందులో భాగంగా పాల్గొని సంపూర్ణ మద్దతు పలికామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు కొండగుర్ల లింగన్న,అంబటి లక్ష్మణ్, ఎస్కే అబ్దుల్లా, కూకట్ కారు బుచ్చయ్య, ఒడిపల్లి ప్రమీల,చంద్రమొగిలి, కోరుట్ల యశోద, ఆత్రం రవి, గుడ్ల రాజన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -