చీరాల వాడరేవు తీరంలో విషాదం.. ముగ్గురు మృతి, ఇద్దరు గల్లంతు
అలల తాకిడికి కొట్టుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థులు
చీరాల : బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంత య్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు సందర్శకులు సూర్యలంక బీచ్‌తో పాటు, వాడరేవు సముద్ర తీరానికి వస్తుంటారు. ఈ క్రమంలో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు బృందంగా వాడరేవుకు వచ్చారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాకేత్, సాయి మణిదీప్, జీవన్ సాత్విక్‌లు అలల తాకిడికి కొట్టుకు పోయారు.స్థానికంగా ఉన్న మత్స్యకా రులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేం దుకు ప్రయత్నిం చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గల్లంతైన కాసేపటికి మృతదే హాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మతదేహాలను చీరాల ప్రభుత్వా స్పత్రికి తరలిం చారు. మరో విద్యార్థి సోమేశ్‌తోపాటు చీరాలకు చెందిన గౌతమ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరి కోసం అగ్ని మాపక, మత్స్యశాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు.
సరదా కోసం బీచ్‌కి వెళ్లి..
- Advertisement -
- Advertisement -