Sunday, March 15, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్తగా 'గోదారి గట్టుపైన'

సరికొత్తగా ‘గోదారి గట్టుపైన’

- Advertisement -

రూరల్‌ లవ్‌, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో హీరో సుమంత్‌ ప్రభాస్‌ అలరించబోతున్నారు. సుభాష్‌ చంద్ర దర్శకత్వంలో రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిధి ప్రదీప్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌, ఫస్ట్‌ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ జోష్‌ని కొనసాగిస్తూ, మేకర్స్‌ తాజాగా మూడో సింగిల్‌ ‘బంగారు బొమ్మ’ను రిలీజ్‌ చేశారు. సంగీత దర్శకుడు నాగ వంశీ సాఫ్ట్‌ బీట్స్‌, సాఫ్ట్‌ స్ట్రింగ్స్‌, హృదయాన్ని హత్తుకునే ఆర్కెస్ట్రేషన్‌తో విన్టేజ్‌ మ్యాజిక్‌ను ఇచ్చారు. వింటేజ్‌ మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ సాంగ్‌ స్వచ్ఛమైన అనుభూతిని అందిస్తుంది.

లిరిక్‌ రైటర్‌ బాలాజీ రాసిన సాహిత్యం హీరో ఫీలింగ్స్‌ని అద్భుతంగా ప్రజెంట్‌ చేస్తోంది. హీరోయిన్‌ని ప్రేమగా ‘బంగారు బొమ్మ’ అని పిలుస్తూ, ఆమెను చూసినా, ఆమె గురించి ఆలోచించినా తనకు అశాంతి కలుగుతుందని చెప్పడం అలరిస్తోంది. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మనసును ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాటకు అసలైన ప్రాణం లెజెండరీ గాయకులు ఎస్‌.పీ. చరణ్‌, కె.ఎస్‌. చిత్ర అందించిన మధుర వోకల్స్‌. వారి హార్మనీ పాటకు గొప్ప మాధుర్యాన్ని, భావోద్వేగాలని జోడిస్తుంది. స్క్రీన్‌ పై సుమంత్‌ ప్రభాస్‌, నిధి ప్రదీప్‌ మధ్య కనిపించే క్యూట్‌ కెమిస్ట్రీ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. ఫస్ట్‌ లవ్‌ స్పార్క్‌ను సెలబ్రేట్‌ చేసే ఈ పాట అందరినీ ఆకట్టుకుంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -