- Advertisement -
- భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు అవకాశం
నవతెలంగాణ-భద్రాచలం
గత 15 రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ, తగ్గుతూ ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదారమ్మ రెండు రోజుల నుంచి మాత్రం క్రమంగా పెరుగుతూ 40 అడుగులకు చేరుకోగా 6,20,470 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రికి 43 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకి రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరి కను అధికారులు జారీ చేస్తారన్న విషయం తెలిసిందే. అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద నేపథ్యంలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ కరకట్ట స్లూఈజ్‌లను పరిశీలించి, ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.
- Advertisement -