Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంశాంతించిన గోదావరి

శాంతించిన గోదావరి

- Advertisement -

– ముంపు మండలాలకు రాకపోకలు బంద్‌
నవతెలంగాణ-భద్రాచలం

భద్రాచలంలో గోదావరి శనివారం మధ్యాహ్నానికి 47 అడుగులకు చేరుకొని క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం నుంచి ముంపు మండలాలైన కూనవరం, విఆర్‌పురం, చింతూరు వెళ్లే రహదారిపై పలుచోట్ల నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం నుంచి చర్లకి వెళ్లే జాతీయ రహదారిపై సైతం తూరుబాక వద్ద గోదావరి వరద చేరడంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలంలో స్నానాల ఘాట్‌ సైతం ముంపునకు గురి కావడంతో యాత్రికులు నదిలోకి వెళ్లకుండా నిలిపివేశారు. మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరోసారి తుది హెచ్చరికకు చేరువగా గోదావరి ప్రవహించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -