నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని యంచ గ్రామ రహదారి వద్ద గోదావరి వరద ముంపు బాధితుల ఆధ్వర్యంలో రాస్తారోకో, మహాధర్నా సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బిజెపి, బిఆర్ఎస్, సిపిఐ పార్టీలు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి వరద ముంపు కారణంగా వేల ఎకరాల్లో వరి పంట నష్టపోయిందని నష్టపోయిన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని అన్నారు. అలాగే రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సరిన్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, బి ఆర్ ఎస్ మండల కన్వీనర్ నర్సింగరావు, తెడ్డు పోశెట్టి, పిఎసిఎస్ చైర్మన్లు శైలేష్ కుమార్, మగ్గరి హన్మాన్లు, స్థానిక నాయకులు సంజీవ్, లాలు యాదవ్, కిషన్ రావు, రవీందర్, భూమయ్య, జగన్ మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గోదావరి వరద ముంపు బాధితుల మహాధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES