- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో నాసిక్ లో ఉప్పొంగి పరుగులు తీస్తోంది. పట్టణంలోని పంచవటి లో రామాలయం పాక్షికంగా మునిగిపోయింది.
పంచవటిలో అత్యంత పురాతనమైన లక్ష్మణ సమేత సీతారాముల ఆలయం ఉంది. పురాతన కాలంలో రాముడు, సీత, లక్ష్మణుడు ఆ ప్రాంతంలో పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నారని, అగస్త్య ముని సలహా మేరకు వారు అక్కడ ఆవాసం ఏర్పరుచుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. పంచవటిలోని రామాలయం గోదావరిలో పాక్షికంగా మునిగింది.
- Advertisement -