నవతెలంగాణ – భువనగిరి
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడ, నల్గొండ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా, మీనా నగర్, రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వద్ద అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు
భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, గూడూరు నారాయణ రెడ్డి, మాయా దశరథ, జగన్మోహన్ రెడ్డి, షవర్ కార్డ్ దుర్గామాత నిర్వాహకులు రత్నాపురం శ్రీశైలం, కామెడీ భరత్ రెడ్డి, కార్తీక్ పాల్గొన్నారు.