Saturday, July 26, 2025
E-PAPER
Homeక్రైమ్గోడెక్కిన కారు..

గోడెక్కిన కారు..

- Advertisement -

మద్యం మత్తులో ఇంటి గోడను ఢకొీట్టిన డ్రైవర్‌..!
నవతెలంగాణ-దుండిగల్‌

డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడపడంతో అదుపు తప్పి ఇంటి గోడను ఢకొీట్టిన కారు ఎగిరి గోడెక్కింది. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. శంభీపూర్‌ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి టాటా కంపెనీకి చెందిన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తు న్నాడు. మహేశ్వరం కాలనీలోని ఒక ఇంటి గోడను ఢకొీన్నాడు. కారు వేగం ఎక్కువగా ఉండటంతో అది ఎగిరి గోడపైకి ఎక్కింది. దీంతో గోడ కొంచెం దెబ్బతింది. ప్రమాద సమయంలో ఆ ఇంటి ముందు ఎవరూ లేకపోవ డంతో ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమా చారం అందుకున్న వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరు కుని క్రేన్‌ సహాయంతో కారును గోడపై నుంచి కిందకు దించారు. దుండి గల్‌ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్‌ను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడిపినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -