Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఆత్మను చాటిన ''గాడ్స్‌ ఇన్‌ ది వాయిస్‌''

తెలంగాణ ఆత్మను చాటిన ”గాడ్స్‌ ఇన్‌ ది వాయిస్‌”

- Advertisement -

– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ఒగ్గు కథను ప్రపంచానికి చాటేలా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ”గాడ్స్‌ ఇన్‌ ది వాయిస్‌” డాక్యుమెంటరీ కల్చర్‌ ఫిల్మ్‌ రూపొందించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. ఆదివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో డాక్టర్‌ జి.కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ”గాడ్స్‌ ఇన్‌ ది వాయిస్‌” టీజర్‌ను ఆమె విడుదల చేశారు. తెలంగాణ ఒగ్గు కథను అద్భుతమైన డాక్యుమెంటరీగా కుమారస్వామితో పాటు మూవీ టీమ్‌ తెరకెక్కించారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, మూవీ యూనిట్‌ సభ్యులు ప్రొఫెసర్‌ జోలి పోతుసెర్రి, మేఘా యాదవ్‌, మహేశ్వర్‌, జయదేవ్‌ యాదవ్‌, సాయి రుద్రకాంత్‌, తిరుపతి యాదవ్‌, కవిత యాదవ్‌, రాజ్‌ కుమార్‌, శ్రీణిక, గనికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -