నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం గౌస్ నగర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఊట్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు, శ్రీ గోపాలకృష్ణ గొర్రెల మేకల పెంకుందారుల సంఘం అధ్యక్షులు పాక జహంగీర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్ల ఉత్సవాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో ఉట్లు కొట్టగా కనుల పండుగ ఉత్సవం కొనసాగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ పాక వెంకటేష్ యాదవ్, నాయకులు భూషబోయిన నరసింహ యాదవ్, బండ బిక్షపతి యాదవ్, భూషబోయిన కిష్టయ్య యాదవ్, పాక శ్రీకాంత్ యాదవ్, పాక భాను యాదవ్, శివ, ప్రసాద్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.