Tuesday, September 23, 2025
E-PAPER
Homeఆటలునేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌

నేటి నుంచి గోల్కొండ మాస్టర్స్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ నేటి నుంచి ఆరంభం కానుంది. హైదరాబాద్‌ గోల్ఫ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు రూ. 1 కోటి నగదు బహుమతి ప్రకటించారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న టోర్నీలో 123 మంది ప్రొఫెషనల్‌ గోల్ఫర్లు పోటీపడుతున్నారు. టాప్‌-4తో పాటు తొలి 50వ స్థానాల్లో నిలిచిన గోల్ఫర్లకు నగదు బహుమతులు అందించనున్నారు. ఈ మేరకు హెచ్‌జీఏ ప్రెసిడెంట్‌ బివికె రాజు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఎల్‌ లక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఐశ్వర మండవ, పీజీటీఐ నుంచి వికాశ్‌ సింగ్‌, గోల్ఫర్లు అర్జున్‌ ప్రసాద్‌, స్టీఫెన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -