Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'రామ్‌ మందిర్‌'కు రూ. 2.50 కోట్ల బంగారం, వెండి ఆభరణాలు

‘రామ్‌ మందిర్‌’కు రూ. 2.50 కోట్ల బంగారం, వెండి ఆభరణాలు

- Advertisement -

– సమర్పించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని రామ్‌ మందిర్‌కి రూ.2.50 కోట్ల విలువ చేసే ఆభరణాలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, అతని కుటుంబ సభ్యులు శుక్రవారం సమర్పించారు. శ్రీరామ నవమి సందర్భంగా జగ్గారెడ్డి, నిర్మల దంపతులు, కూతురు, కొడుకుతో కలిసి వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఊరేగింపుగా వారి ఇంటి వద్ద నుంచి ఆభరణాలు తీసుకొని వెళ్లి ఆలయంలో సమర్పించారు. రంగపేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపారు. జగ్గారెడ్డి, ఆయన మిత్రులు రామ్‌ మందిర్‌ యువసేన, రామ్‌ మందిర్‌ కమిటీ పెద్దల సహకారంతో సీతారాముల కోసం రూ.2.50 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. 2500 బంగారంతో కర్ణభరణాలతో కూడిన కిరీటాలు, కంటాభరణాలు, వడ్డాణాలు, పద్మ పాదాలు, ధనుస్సు, బాణం, యజ్ఞోపవేతం, తిలకాలు, ముక్కు పోగు, శంకు చక్రాలు ఉన్నాయి. అలాగే అమ్మవారికి మంగళసూత్రం, కమల హస్తం, శ్రీరాములవారికి శరంతో కూడిన హస్తం ఉన్నాయి. వెండితో ఆదిశేషుడు, వెండి కళ్యాణ పీట తయారు చేయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -