జాతీయస్థాయికి వినోద్..
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన దుర్గం వినోద్ సీనియర్ జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం నల్గొండలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో అతను బంగారు పతకం సాధించాడు. ఈ విజయంతో అతను వచ్చే నెలలో కర్ణాటక రాష్ట్రం, మైసూరులో 9 నుంచి 12వ తేదీల వరకు జరిగే జాతీయస్థాయి యోగా పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. దుర్గం వినోద్ ఆ బంగారు పతకాన్ని తెలంగాణ యోగ అసోసియేషన్ ఇంచార్జ్ సిద్ధారెడ్డి యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జాల మనోహర్, చేతులు మీదుగా అందుకున్నారు. సీనియర్ జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికైన దుర్గం వినోద్ ను మండలంలోని ప్రముఖులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అభినందించారు.
యోగా పోటీలలో రాష్ట్రస్థాయిలో స్వర్ణం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES