Saturday, July 19, 2025
E-PAPER
Homeఆటలుబంగారు బాతు 'ఐపీఎల్‌'

బంగారు బాతు ‘ఐపీఎల్‌’

- Advertisement -

– గతేడాది బీసీసీఐ ఆదాయం రూ.9741.7 కోట్లు
– అందులో ఐపీఎల్‌ వాటా రూ.5761 కోట్లు
నవతెలంగాణ-ముంబయి

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) బంగారు బాతు ‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)’ కాసుల వర్షం కురిపిస్తోంది. మీడియా హక్కుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో రూ. వేల కోట్లు ఖాతాలో వేసుకున్న బీసీసీఐ.. 2023-24 ఆర్థిక ఏడాది రూ.9741.7 కోట్ల ఆదాయం ఆర్జించింది. బ్రాండింగ్‌, యాడ్‌ దిగ్గజ సంస్థ రిడిఫ్యూషన్‌ రూపొందించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
ఐదేండ్ల ఐపీఎల్‌ మీడియా హక్కులకు రూ.48,390.5 కోట్లు దక్కించుకున్న బీసీసీఐ.. ఆ ఫలాలను వార్షిక ఆదాయం రూపంలో ఆస్వాదిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.5761 కోట్లను ఐపీఎల్‌ నుంచి బోర్డు ఆర్జించింది. భారత అంతర్జాతీయ మ్యాచులతో రూ.361 కోట్లు బోర్డు ఖాతాలో వేసుకుంది. ‘రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, సికె నాయుడు ట్రోఫీలను కమర్షియల్‌గా ప్రమోట్‌ చేసుకుంటూ నాన్‌ ఐపీఎల్‌ ఆదాయం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం బీసీసీఐకి ఉంది’ అని నివేదిక తెలిపింది. 2025 ఐపీఎల్‌ ఆపరేషన్‌ సింధూర్‌ కారణంగా ఓ వారం రోజులు నిలిచిపోవటం సైతం బోర్డు ఆదాయ ఆర్జనకు ఉపయోగపడిందని ఈ నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ సైతం స్పాన్సర్లను ఆకర్షించటం బోర్డుకు కలిసొచ్చింది.

వడ్డీ రూ.వెయ్యి కోట్లు
బీసీసీఐ ఖాతాలో ప్రస్తుతం రూ.30 వేల కోట్లు నిల్వ ఉన్నాయని నివేదిక తెలిపింది. దీంతో వడ్డీ రూపంలోనే బోర్డు ఏడాదికి రూ. 1000 కోట్లు ఆర్జిస్తుంది. బ్యాంక్‌లో రూ.30 వేల కోట్ల నిధులు ఏడాదికి సగటున 10-12 శాతం వృద్ది చెందుతాయి. దీంతో ఐసీసీ.. భారత క్రికెట్‌ బోర్డుపై ఆధారపడాల్సి వస్తోంది. ఐసీసీ ఆదాయ వనరులు సైతం భారత్‌లోనే ఉండటంతో.. ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ పెత్తనం చెలాయిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -