Thursday, May 29, 2025
Homeఆటలుగుల్వీర్‌ సింగ్‌కుస్వర్ణం

గుల్వీర్‌ సింగ్‌కుస్వర్ణం

- Advertisement -

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌
గుమీ(దక్షిణ కొరియా): అసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌ బోణి కొట్టింది. తొలిరోజే గుల్వీర్‌ సింగ్‌ స్వర్ణ పతకంతో మెరిశాడు. పురుషుల 10 వేల మీటర్ల పరుగును 28 నిమిషాల 38 నిమిషాల 63 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే గుల్వీర్‌ జాతీయ రికార్డు కూడా నెలకొల్పాడు. మెబుకి సుజుకీ(జపాన్‌) 28 నిమిషాల 43 నిమిషాల 84 సెకన్లతో ముగించి రజత పతకం, ఆల్బర్ట్‌ కిబిచి రోప్‌(బహ్రెయిన్‌) 28 నిమిషాల 46.82 సెకన్లతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. తద్వారా ఈ టోర్నీ 10 వేల పరుగులో స్వర్ణం సాధించిన మూడో భారతీయుడిగా గుల్వీర్‌ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు హరి చంద్‌(1975), జీ. లక్ష్మణన్‌(2017)లు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పసిడితో పోడియం మీద భారత పతాకాన్ని రెపరెపలాడించారు. గుల్వీర్‌ సింగ్‌ మరో పతకం సాధించే అవకాశం కూడా ఉంది. 30న జరిగే పురుషుల 5వేల మీటర్ల ఫైనల్లో అతను పాల్గొననున్నాడు. 5 వేల మీటర్ల రేసులో గుల్వీర్‌కు మంచి రికార్డు ఉంది.
20 కి.మీ. నడకలో సెబాస్టియన్‌కు కాంస్యం
ఇక పురుషుల 20 కి.మీ నడకలో సెర్విన్‌ సెబాస్టియన్‌ 1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లు కాంస్యం సాధించాడు. చైనాకు చెందిన వాంగ్‌ జావోజావో 1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు స్వర్ణ పతకం అందుకోగా.. జపాన్‌కు చెందిన కెంటో యోషికావా 1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు రజతం దక్కించుకున్నాడు. మహిళల జావెలిన్‌త్రోలో అన్నురాణి తృటిలో కాంస్యం పతకం చేజార్చుకుంది. అన్నురాణి బెస్ట్‌ త్రో 58.30 మీటర్లు కాగా.. 64 సెంటీమీటర్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి మెడల్‌ను మిస్‌ చేసుకుంది. జపాన్‌కు చెందిన సే టకేమోటో (58.94 మీటర్లు) కాంస్య పతకం సాధించింది. సు లింగ్డాన్‌ (చైనా.. 63.29 మీటర్లు) స్వర్ణం, మోమోన్‌ ఉడా (జపాన్‌.. 59.39 మీటర్లు) రజత పతకాలు అందుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -