Wednesday, October 8, 2025
E-PAPER
Homeఆటలుహుసాముద్దీన్‌కు స్వర్ణం

హుసాముద్దీన్‌కు స్వర్ణం

- Advertisement -

బిఎఫ్‌ఐ బాక్సింగ్‌ కప్‌ 2025

చెన్నై (తమిళనాడు) : అరంగేట్ర బిఎఫ్‌ఐ బాక్సింగ్‌ కప్‌ 2025లో తెలంగాణ స్టార్‌, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ పతక విజేత మహ్మద్‌ హుసాముద్దీన్‌ పసిడి పంచ్‌ విసిరాడు. ఆదివారం చెన్నైలో జరిగిన మెన్స్‌ 60 కేజీల విభాగం ఫైనల్లో హుసాముద్దీన్‌ 5-0తో సాగర్‌ (సారు)పై ఏకపక్ష విజయం సాధించాడు. సర్వీసెస్‌ తరఫున బరిలోకి దిగిన హుసాముద్దీన్‌ పసిడి పోరులో సహచర బాక్సర్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. సర్వీసెస్‌కు చెందిన ఇతర బాక్సర్లు సైతం పసిడి పతకాలు సాధించిన జాతీయ బాక్సింగ్‌ ఎరినాలో సర్వీసెస్‌ ఆధిపత్యాన్ని చాటారు.

ఆసియా అండర్‌-22 చాంపియన్‌ ఎస్‌ విశ్వనాథన్‌ 50 కేజీల విభాగంలో ఆశీష్‌పై 5-0తో గెలుపొందగా.. నవరాజ్‌పై ఆశీష్‌ 3-2తో మెన్స్‌ 55 కేజీల విభాగం ఫైనల్లో విజయం సాధించాడు. మెన్స్‌ 65 కేజీల విభాగం ఫైనల్లో వన్షాజ్‌ 3-2తో సహచర సర్వీసెస్‌ బాక్సర్‌ ప్రీత్‌ మాలిక్‌పై సాధికారిక విజయం సాధించాడు. 75 కేజీల విభాగం ఫైనల్లో సచిన్‌ 5-0తో నీరజ్‌పై పైచేయి సాధించగా.. అంకుశ్‌ 5-0తో 80 కేజీల విభాగం ఫైనల్లో ఆమన్‌ను చిత్తు చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -