Thursday, May 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం మడ్డి.. ఊపిరాడక నలుగురి మృతి

సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం మడ్డి.. ఊపిరాడక నలుగురి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సెప్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి అందులోకి వెళ్లి నలుగురు కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం.. జైపుర్‌లోని ఒక జ్యువెలరీ షాపు యజమాని వికాస్ మెహతా బంగారం వెండిని తమ సిబ్బంది ప్రాసెసింగ్‌ చేస్తున్న సమయంలో అందులో కొంత మొత్తం సెప్టిక్‌ ట్యాంక్‌లో పేరుకుపోయినట్లు గుర్తించారు. వాటిని బయటకు తీయాలని సోమవారం అతడు ఎనిమిది మంది కూలీలు చెప్పడు. సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగేటప్పుడు వారు ఎటువంటి భద్రతా పరికరాలు తీసుకెళ్లకపోవడంతో.. బంగారం వెతికె సమయంలో ఊపిరాడక కూలీ వారు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీయగా రోహిత్ పాల్, సంజీవ్ పాల్, హిమాంగ్షు సింగ్, అర్పిత్ యాదవ్ అనే నలుగురు కూలీలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎటువంటి భద్రతా చర్యలు లేకుండా భూగర్భ సెప్టిక్ ట్యాంక్‌లోకి  కార్మికులను పంపడంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఆభరణాల షాపు యజమాని, కాంట్రాక్టర్లపై చర్యలు పోలీసులు తీసుకుంటామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -