నూతన గరిష్టాల నమోదు
కిలో వెండిపై రూ.20,400 పెరిగి రూ.3.23 లక్షలకు
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులకు అందకుండా ఈ రెండు లోహాల ధరలు పోటాపోటీగా పరుగులు పెడుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ.1.5 లక్షలకు చేరి నూతన గరిష్టాలను నమోదు చేసింది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.5,100 ఎగిసి రూ.1,53,200కు చేరిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇంతక్రితం సెషన్‌లో రూ.1,48,100గా నమోదయ్యింది. వెండి ధరలు ఎగిశాయి. కిలో వెండిపై రూ.20,400 పెరిగి అన్ని పన్నులు కలుపుకుని రూ.3.23 లక్షలకు చేరింది. సోమవారం కూడా ఈ లోహం ధర రూ.10వేలు పెరిగి రూ.3 లక్షల మార్క్‌ను తాకింది. అంతర్జాతీయంగా ఒక్క ఔన్స్ పసిడిపై 66.38 డాలర్లు లేదా 1.42 శాతం పెరిగి 4,737.40 డాలర్లుగా నమోదయ్యింది. ఒక్క ఔన్స్ వెండి ధర 95.88 డాలర్లుగా పలికింది.
బంగారం ఏ 1.5 లక్షలు
- Advertisement -
- Advertisement -



