24 క్యారెట్ల 10 గ్రాములు రూ.1,56,750కి
22 క్యారెట్లు రూ.1,43,700
న్యూఢిల్లీ : బంగారం ధరలు దూసుకుపోతూనే ఉన్నాయి. పసిడి, వెండి ధరలు రోజురోజుకు కొత్త రికార్డ్‌ను సృష్టిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ ఉన్మాదానికి తోడు పలుదేశాలపై యుద్ధాలకు కత్తికట్టడంతో బంగారం ధర ఎగిసి పడుతోంది. మరోవైపు డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి రికార్డ్ పతనం పసిడి ధర మరింత పెరగడానికి కారణమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.6,840 ఎగిసి రూ.1,56,750కి చేరింది. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పసిడి రూ.5,130 ప్రియమై రూ.1,43,700గా పలికింది. కిలో వెండిపై రూ.10వేలు పెరిగి రూ.3.30 లక్షలకు చేరింది. దీంతో 10 గ్రాముల వెండి ధర రూ.3300గా నమోదయ్యింది.
బంగారం పరుగో..పరుగో
- Advertisement -
- Advertisement -



