Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంబంగారం భగభగ

బంగారం భగభగ

- Advertisement -

10 గ్రాములు రూ.1.30 లక్షలు ఆగని వెండి మెరుపులు
న్యూఢిల్లీ :
బంగారం, వెండి ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. పసిడి ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రూ.1.30 లక్షలకు ఎగిసి భగ్గుమంటోంది. ఆల్‌ ఇండియా షరాఫ్‌ అసోసియేషన్‌ ప్రకారం.. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,850 పెరిగి అన్ని పన్నులు కలుపుకుని రూ.1,30,800కు చేరింది. ఇంతక్రితం సెషన్‌లో రూ.1,27,950 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి రూ.2,850 ప్రియమై రూ.1,30,200గా పలికింది. కిలో వెండిపై ఏకంగా రూ.6,000 ఎగిసి రూ.1,85,000కు చేరింది. ఇది వరుసగా ఐదో రోజూ పెరుగుదల. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ బంగారం 0.72 శాతం పెరిగి ఒక్క ఔన్స్‌ ధర రూ. 4,140.34కు చేరి.. ఆల్‌టైం గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఒక్క ఔన్స్‌ స్పాట్‌ వెండి 1.92 శాతం ప్రియమై 53.54 డాలర్లుగా చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -