యాక్సిస్ బ్యాంక్, ప్రీచార్జ్ సరికొత్త సేవలు
హైదరాబాద్ : ప్రయివేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ తన డిజిటల్ సబ్సిడరీ ఫ్రీచార్జ్‌తో కలిసి దేశంలోనే తొలిసారిగా గోల్డ్ లోన్స్ ఆధారంగా క్రెడిట్ ఆన్ యూపీఐ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో ఎంఎస్‌ఎంఈ, స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారులు, మర్చంట్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ బంగారం ఆధారంగా తక్షణ రుణాన్ని పొందవచ్చని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునీష్ శారదా తెలిపారు. ఇది పూర్తిగా డిజిటల్ మార్పు అని.. గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత ఎలాంటి బ్రాంచ్ సందర్శన అవసరం లేకుండానే రుణం పొందవచ్చని, అదే విధంగా వినియోగించిన మొత్తంపైనే వడ్డీ విధించబడుతుందన్నారు. ఫ్రీచార్జ్ యాప్ లేదా ఏదైనా యూపీఐ యాప్ ద్వారా తక్షణ చెల్లింపులు, రీపేమెంట్స్ సులభంగా చేయవచ్చన్నారు.
బ్రాంచ్ సందర్శించకుండానే పసిడి రుణం
- Advertisement -
- Advertisement -