నవతెలంగాణ –కాటారం: ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ సెలక్షన్ ట్రయల్స్‌లో కాటారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం క్రీడాకారులు సున్నం చరణ్, ఆర్. రోహిత్, సొర్లం రాంతేజ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు గోల్డ్ మెడల్ సాధించి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ పోటీల్లో అసాధారణ ప్రతిభ చూపిన సున్నం చరణ్‌కు బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కడం విశేషం. అలాగే చరణ్, రాంతేజ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాధ మాధవి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ ఎం. వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ డి. బలరాం, పీడీ కుడిమేత మహేందర్, పీఈటీ మంతని శ్రీనివాస్, కోచ్ మూల వెంకటేష్, డిప్యూటీ వార్డెన్ రాజబాబు తదితర ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో ట్రైబల్ వెల్ఫేర్ క్రీడాకారులకు గోల్డ్ మెడల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



