- Advertisement -
24 క్యారెట్లు..10 గ్రాములు రూ.1,44,150
22 క్యారెట్ల్లు రూ.1,32,150
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భౌగోళిక ఆందోళనలను రెచ్చగొట్టడంతో పాటుగా మరోవైపు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందనే సంకేతాలు బంగారం ధరలు ఎగిసిపడేలా చేస్తోన్నాయి. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,470 పెరిగి రూ.1,44,150కు చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.1,350 ప్రియమై రూ.1,32,150 వద్ద ముగిసింది. కిలో వెండిపై రూ.15,000 ఎగిసి రూ.2,90,000గా నమోదయ్యింది.
- Advertisement -



