Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివాదాల పరిష్కారానికి సువర్ణ అవకాశం 

వివాదాల పరిష్కారానికి సువర్ణ అవకాశం 

- Advertisement -

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్ పర్సన్ ఎమ్.ఆర్.సునీత 
నవతెలంగాణ – వనపర్తి 

వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణవకాశం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్ సునీత ఒక ప్రకటనలో అన్నారు. ఈ నెల 21 తేదీన నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలని అన్నారు. లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్ లు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు. లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీపడడం వలన డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అని, లోక్ అదాలత్ వలన సంవత్సరాల తరబడి ఉండే కోర్టు కేసులకు తక్షణ ముగింపు, ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదు అని, లోక్ అదాలత్ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదు అని మరియు దావా వేయడానికి కోర్టుల్లో చెల్లించిన కోర్టు ఫీజు వాపస్ చేయబడుతుంది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -