- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్
మండలంలోనీ మల్లూరు గ్రామానికి చెందిన గొల్ల అజయ్ కుమార్ మొన్న విడుదల అయిన బిఎస్ఎఫ్ (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ఫలితాలలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఎంపిక అయ్యాడు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అజయ్ ఉద్యోగం సాధించడంతో గ్రామంలోని పెద్దలు అజయ్ కు అభినందనలు తెలియజేశారు. అజయ్ ఆరో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యను అభ్యసించాడు. మొదటిసారి బిఎస్ఎఫ్ ఉద్యోగం కోసం 2023లో ప్రయత్నం చేసి విఫలం అవ్వగా.. మరోసారి ప్రయత్నించి ఉద్యోగం సాధించాడు.
- Advertisement -



