Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంపీఎఫ్‌కు మంగళం!

పీఎఫ్‌కు మంగళం!

- Advertisement -

వంద శాతం విత్‌డ్రాకు అనుమతి
నిబంధనలు సరళీకరించిన ఈపీఎఫ్‌ఓ సీబీటీ

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌) బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటోంది. ఇప్పటి వరకు రిటైర్మెంట్‌ అయ్యాక, పెన్షన్‌ సహా కాస్తో కూస్తో ఆర్థిక భరోసానిచ్చే ఈ స్కీంను మొత్తానికే ఎత్తివేసే చర్యలకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పాల్పడుతోందని ఉద్యోగ, కార్మిక సంఘాలు చెప్తున్నాయి. దానికి అనుగుణంగానే ఉద్యోగులు తమ పీఎఫ్‌ను వందశాతం విత్‌డ్రా చేసుకొనేందుకు వీలుగా ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌ఓలో ఉండే ఉద్యోగులు, కార్మికుల సొమ్ముకు ఆ సంస్థ 8.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. గతంలో ఉద్యోగి జమచేసిన సొమ్ములో నుంచి మాత్రమే పాక్షిక విత్‌డ్రాకు అవకాశం ఉండేది. ఆ తర్వాత సంస్కరణల పేరుతో క్రమేణా ఆ పరిమితులు పెంచుతూ వచ్చారు. కోవిడ్‌ సమయంలో పీఎఫ్‌ సొమ్ము అనేకమంది అవసరాలను తీర్చింది. అప్పటి నుంచే మోడీ సర్కార్‌ ఈ స్కీంను క్రమేణా నిర్వీర్యం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగి జమ చేసిన సొమ్ముతో పాటు యజమాని వాటాను కూడా ఎలాంటి షరతులు లేకుండా విత్‌డ్రా చేసుకొనేందుకు అనుమతిస్తూ కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో సమావేశమైన ఈపీఎఫ్‌వో ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌’ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏడు కోట్ల మందికి పైగా చందాదారులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది.

పీఎఫ్‌ పాక్షిక విత్‌డ్రాకు సంబంధించిన 13 నిబంధనలను సీబీటీ ఒకే నిబంధనగా క్రమబద్ధీక రించింది. వాటిని 1.ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం)2. గృహ అవసరాలు 3. ప్రత్యేక పరిస్థితులు అంటూ మూడు రకాలుగా వర్గీకరించింది. విత్‌డ్రా లిమిట్స్‌ను పెంచింది. చదువుల కోసం 10 సార్లు, వివాహాల కోసం ఐదుసార్లుగా నిర్ణయించారు. వీటికి చందాదారుల కనీస సర్వీసును 12 నెలలకు తగ్గించారు. గతంలో ‘ప్రత్యేక పరిస్థితులు’ ఆప్షన్‌ కింద పాక్షిక పీఎఫ్‌ ఉపసంహరణకు నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది. ఇప్పుడు ఎలాంటిి కారణాలు చెప్పకుం డానే వందశాతం సొమ్మును విత్‌డ్రా చేసుకో వచ్చు. మరోవైపు పీఎఫ్‌ ఖాతాలో జమచేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా ఉంచా లనే నిబంధన అమలు సందిగ్ధంలో పడింది. ఈ సొమ్ముకు ఈపీఎఫ్‌వో ప్రస్తుతం 8.25 శాతం వడ్డీతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను అందిస్తుం ది. తాజా సవరణలతో వీటన్నింటినీ ఉద్యోగులు, కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -