Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్గుడ్ న్యూస్.. తగ్గిన చికెన్ ధరలు

గుడ్ న్యూస్.. తగ్గిన చికెన్ ధరలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సండే వస్తే చాలు ఇంట్లో నాన్‌వెజ్ కర్రీ ఉండాల్సిందే. కొందరికి చికెన్ అంటే ఇష్టం. మరికొందరికీ మటన్ అంటే ఇష్టం ఉంటుంది. ఏదేమైనా సరే నాన్‌వెజ్ ప్రియులు మాత్రం మార్కెట్లోకి వెళ్లి సండే స్పెషల్‌గా ఇంట్లోకి చికెన్ లేదా మటన్ తీసుకొస్తారు. అయితే గత కొంతకాలం నుంచి మాంసం ధరలు పెరగడం, తగ్గడం వంటివి చూస్తున్నాం. ఈ క్రమంలో చికెన్ లవర్స్‌కి ఈ వారం ధరలలో కాస్త ఊరట లభించిందనే చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(ఆదివారం) చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కిలోపై రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కేజీ చికెన్ రూ.210 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.200, రాజమండ్రిలో రూ.220 ధరలకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి పలు ప్రాంతాల్లో రూ.260 వరకు విక్రయిస్తూన్నారు. ఇదిలా ఉంటే.. ఆషాడ మాసం ప్రారంభమవుతున్న కారణంగా కోళ్ల ధరలు చికెన్ రేట్లు భారీగా పెరుగుతాయని చికెన్ షాప్ యజమానులు చెబుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad