నవతెలంగాణ-హైదరాబాద్: మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అని అన్నపుడు, పుస్తకమని చెప్పాడు ప్రపంచ మేధావి ఐనిస్టీన్. అట్లాంటి గొప్ప సృష్టి అయిన వస్తువుల సందోహం మనముందుకు వస్తున్నది. పుట్టిన రోజు కానుకగా ఏమి కావాలని అడిగినపుడు పుస్తకాలు కావాలని కోరుకున్నారట విప్లవ నాయకుడు లెనిన్. ప్రాణంపోతున్న క్షణం ముందువరకూ పుస్తకంతోనే గడిపిన భగత్సింగ్ ప్రేమించిన అక్షరాలు లక్షలాదిగా మన ముంగిట కొస్తున్నాయి. ఆ అక్షరావరణంలోకి మనం వెళితే అనేకానేక ఉత్సాహాలను పొందగలుగు తాము. ప్రేరణ, స్ఫూర్తి, చైతన్యం, జ్ఞానం మనలో నిండుతుంది. నేటి భయంకర వస్తువినిమయ ప్రపంచాన, ఉత్కృష్టమైన వినియోగదారీ మార్కెట్ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిర వుతున్న జనసామాన్యాలకు ఓ చల్లని పలకరింపు ఈ సందర్భం..రేపు NTR స్టేడియం పుస్తకాల వెలుగులు చిమ్మనున్నది. 38వ పుస్తకాల జాతరకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యాన ఈ నెల 19 నుండి 29 వరకు ఈ పుస్తకాల మేళ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9గంటలకు వరకు మేళ సాగనుంది. ఈసారి 350కిపైగా బుక్ స్టాల్స్‌లను నిర్వహకులు ఏర్పాటు చేశారు. ఈ పదకొండు రోజులూ పుస్తకాల అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.
పుస్తక ప్రియులకు శుభవార్త..రేపే బుక్‌ఫెయిర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



