Thursday, November 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గత ఇరవై రోజులుగా నిరంతరాయంగా పెరుగుతూ కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనాలనుకునేవారికి ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే, బంగారానికి భిన్నంగా వెండి ధర మాత్రం ఒక్కరోజే గణనీయంగా పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేటి ధరలను పరిశీలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,700 తగ్గి రూ.1,12,100కి చేరింది. అదేవిధంగా, అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.1,860 పతనమై రూ.1,22,290 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లతో పోలిస్తే ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది.

మరోవైపు, వెండి ధర మాత్రం అనూహ్యంగా దూసుకుపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగి రూ.1,80,000 మార్కును తాకింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -