నవతెలంగాణ -హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత సంవత్సరం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ. 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధులలో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితో పాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్ లు, అడ్వాన్సులు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



