- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. నిధులు విడుదల చేయడంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. చేనేత కార్మికులపై ఉన్న అప్పులను తీర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.
- Advertisement -



