నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును (లైఫ్‌ట్యాక్స్) రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ పంపిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండో వాహనం కొనేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.1.20 లక్షల విలువైన బైక్‌ను రెండో వాహనంగా కొంటే రూ.2,400 అదనంగా కట్టాల్సి వస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ మొత్తం ఆదాయం తగ్గినా, ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది.
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్..
- Advertisement -
- Advertisement -



