నవతెలంగాణ – హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ బుధవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాలుపంచుకుంటున్నారని చిత్ర నిర్మాణ సంస్థ పీఆర్ టీమ్ అధికారికంగా తెలియజేసింది. “అసలైన ‘ఓజీ’ సెట్‌లోకి అడుగుపెట్టారు” అంటూ వారు చేసిన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్, ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. పవన్ కల్యాణ్ డేట్స్ కోసమే చిత్ర బృందం వేచి చూసినట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలు మినహా, మిగిలిన నటీనటుల భాగాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్‌తో సినిమా మొత్తం చిత్రీకరణను ఒకేసారి పూర్తి చేయాలని దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES