Thursday, July 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలురైల్వే ప్ర‌యాణికులుకు తీపి క‌బురు..8మంది గంట‌ల ముందే చార్టింగులు

రైల్వే ప్ర‌యాణికులుకు తీపి క‌బురు..8మంది గంట‌ల ముందే చార్టింగులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలో జులై 11వ తేదీ నుండి ఎనిమిది గంటల ముందుగానే రైల్వే ప్యాసింజర్‌ చార్టింగులు రూపొందించనున్నామని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డిసిఎం కె. సందీప్‌ తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2:00 గంటల కన్నా ముందు బయలుదేరే రైళ్లకు మునుపటి రోజు రాత్రి 9:00 గంటల లోపు చార్ట్‌ తయారవుతుందని అదేవిధంగా మధ్యాహ్నం 2:00 గంటల తర్వాత నుండి మరుసటి రోజు ఉదయం 5:00 గంటల లోపు బయలుదేరే రైళ్లకు ఎనిమిది గంటల ముందుగా చార్ట్‌ తయారు చేయబడుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుత రిజర్వేషన్‌ విధానం ప్రకారం రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్‌ తయారు చేయబడుతుందని తద్వారా ప్రయాణికులు కలుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కరించడం కోసం చార్జింగ్‌ వేళల్లో మార్పులు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా వెయిటింగ్‌ లిస్ట్‌ స్థితిపై ప్రయాణికులు ముందుగానే సమాచారం అందుతుందని తద్వారా దూర ప్రాంతాల నుండి లేదా ప్రధాన నగరాల శివారు ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రయాణికులకు ప్రయోజనం చేయకూరుతుందన్నారు. అదే విధంగా వెయిటింగ్‌ లిస్టు నిర్ధారణ కాకపోతే ప్రతి ప్రత్యాన్మయా ఏర్పాట్లు చేసుకోవడానికి సమయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -