Thursday, July 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో 10 రోజులు సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టులో 10 రోజులు సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆగస్టు నెలలో ఆదివారాలతో కలుపుకుని ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయనీ విద్యార్థులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇందులో ఐదు ఆదివారాలు ఉండటం విశేషం. మిగిలిన ఐదు రోజులు పండగలు ఉన్నాయి. ఇక ఆగస్టులో మొత్తం 31 రోజులు ఉంటే, అందులో 10 రోజులు సెలవులు. 21 రోజులు మాత్రమే స్కూళ్లు, విద్యా సంస్థలు నడుస్తాయి. ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ఇలా ఉంది. ఆగస్టు 3న ఆదివారం దేశవ్యాప్తంగా సాధారణ సెలవు ఉంటుంది.
ఆగస్టు 8 శుక్రవారం : శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం.
ఆగస్టు 9, శనివారం : రెండో శనివారం సాధారణ సెలవు, అలాగే రక్షా బంధన్ పండుగ.
ఆగస్టు 10, ఆదివారం : దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్కూళ్లకు సెలవు.
ఆగస్టు 15, శుక్రవారం : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు , స్కూళ్లకు సెలవు.
ఆగస్టు 16, శనివారం : కృష్ణాష్టమి, బ్యాంకులు, స్కూళ్లకు సెలవు.
ఆగస్టు 17, ఆదివారం : సాధారణ సెలవు.
ఆగస్టు 24, ఆదివారం : దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, స్కూళ్లకు సెలవు.
ఆగస్టు 27, బుధవారం : వినాయక చవితి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, గోవా, తమిళనాడు, మహారాష్ట్రలో బ్యాంకులు, స్కూళ్లకు సెలవు.
ఆగస్టు 31, ఆదివారం : సాధారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -