Wednesday, May 14, 2025
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ రైతులకు శుభవార్త..!

తెలంగాణ రైతులకు శుభవార్త..!

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న రైతు భరోసాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నాలుగెకరాలు, ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక.. అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. రబీ సీజన్‌కు సంబంధించి నాలుగు నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా రైతు భరోసా నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్ది ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చేవారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ ఏడాదికి సంబంధించి.. ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం.. జూన్ నెల వరకు రబీ సీజన్‌కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తరువాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -