- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇళ్ల నిర్మాణం చేస్తున్న వారికి పెండింగ్ బిల్లులను తాజాగా విడుదల చేసింది. మొత్తం రూ.28.50 కోట్లను 2,764 మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను కూడా క్లియర్ చేస్తున్నట్టు హౌసింగ్ కార్పొరేషన్ తెలిపింది. కాగా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- Advertisement -



