నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూముల విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనే చేయొచ్చు. ముఖ్యంగా తక్కువ ఫీజుతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వారసత్వ భూముల విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విలువ ఎక్కువైతే రూ.1,000 స్టాంప్ డ్యూటీ కింద వసూలు చేస్తారు. ఆస్తి యజమాని మరణించిన తరువాత వారసులు పొందే భూములకే ఈ సౌకర్యం వర్తిస్తుంది. మిగిలిన భూముల విషయంలో ఇప్పటిలాగే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది.
రెవెన్యూ వ్యవస్థలో విస్తృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారసత్వ ధ్రువీకరణ లేకపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు వస్తుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. కుటుంబ కలహాలు, రిజిస్ట్రేషన్ జాప్యాలు వంటి ఇబ్బందుల నివారణకే ఈ సులభతర విధానం రూపొందించారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసులు తహసీల్దార్‌కు దరఖాస్తులు ఇచ్చినా, మ్యుటేషన్‌లు సకాలంలో జరగడం లేదన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గతేడాది 55 వేల దరఖాస్తులపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాక, కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదని భావించి భూమిని పాత యజమానుల పేర్లతోనే ఉంచుతున్నారు.
దీని వల్ల రికార్డుల్లో గందరగోళాలు వస్తున్నాయి. గ్రామాల్లో వారసత్వ వివాదాలు పెరగటంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ధ్రువీకరణ పత్రం (సక్సెషన్ సర్టిఫికెట్) జారీ ప్రక్రియను సులభతరం చేశారు. రూ.10 లక్షల లోపు భూములకు రూ.100, అధిక విలువ కలిగిన భూములకు రూ.1,000 ఫీజు. ఈ సర్టిఫికెట్లు స్థానిక సచివాలయాల్లోనే జారీ అవుతాయి. గ్రామాల్లో వారసత్వ వివాదాలు పెరగటంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ధ్రువీకరణ పత్రం (సక్సెషన్ సర్టిఫికెట్) జారీ ప్రక్రియను సులభతరం చేశారు. రూ.10 లక్షల లోపు భూములకు రూ.100, అధిక విలువ కలిగిన భూములకు రూ.1,000 ఫీజు. ఈ సర్టిఫికెట్లు స్థానిక సచివాలయాల్లోనే జారీ అవుతాయి. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు కూడా ఈ ప్రక్రియకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాయి. రెండు నుంచి మూడు నెలల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశముంది.





గ


