Tuesday, September 16, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సామాన్య ప్రజలకు శుభవార్త.. తగ్గనున్న వంటనూనెల ధరలు

సామాన్య ప్రజలకు శుభవార్త.. తగ్గనున్న వంటనూనెల ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సామాన్య ప్రజలను చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ వస్తున్న వంటనూనెల ధరలు ఇప్పడు శుభవార్త చెప్పింది. వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా భారత ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి వంటనూనెలపై సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మే 30నుంచి తగ్గించిన సుంకాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. దేశీయ డిమాండ్ కారణంగా దిగుమతి చేసుకుంటున్న సోయా ఆయిల్, పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. వీటిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గతంలో ఉన్న 20 శాతం నుంచి ప్రస్తుతం 10 శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -